మీరు కాలుస్తోంది సిగరెట్‌ను కాదు, మీ ఆరోగ్యాన్ని నో స్మోకింగ్ డే... ధూమపానం చేసేవారి కళ్లు తెరిపించడం కోసం పుట్టుకొచ్చిన ఒక ప్రత్యేక దినోత్సవం. ధూమపానం వల్ల వచ్చే స్వీయ ఆరోగ్యానికే కాదు, సమాజానికీ హానికరమే. సిగరెట్ పొగలో 7000 కంటే ఎక్కువ రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో 250 చాలా హానికరమైనవి. ధూమపానం వల్ల ప్రపంచంలో ఏడాదికి 70 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. చట్టబద్ధంగా అమ్ముతున్న హానికర వస్తువు పొగాకు. ఇది తన వినియోగదారుల్లో సగం మందిని చంపే అవకాశం ఉంది. ధూమపానం ఇచ్చే కిక్కు కోసం చూసుకుంటే మగవారిలో లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. సిగరెట్ తాగే మహిళల్లో అధికంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ప్రాణాంతకమైన సమస్య. ధూమపానం అధికంగా చేసేవారిలో త్వరగా దంతాలు రాలిపోతాయి. పొగాకు వల్ల నిమోనియా, ఎంఫిసెమా, తీవ్ర బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం అధికం.