మేషం మేష రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వ్యాపారంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఇంట్లో పరస్పర సామరస్యం లోపిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందలేరు.
వృషభం చదువుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం గురించి చర్చించుకునేందుకు శుభసమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. మీ కెరీర్లో పురోగతి పొందుతారు.
మిథునం ఈరోజు కష్టతరంగా గడుస్తుంది. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఆకస్మిక ఖర్చుల కారణంగా కలత చెందుతారు. ఆర్థిక లావాదేవీలో పొరపాటు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి.
కర్కాటకం ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందొచ్చు. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ ధనలాభం ఉంటుంది. మీ స్నేహితుడితో మనసులోని మాటలను పంచుకుంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
సింహం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయం. మీతో కలసి పనిచేసే వారు మీతో సంతోషంగా ఉంటారు. మీ దృఢ సంకల్పం వల్ల మీరు విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ రోజు పాత స్నేహితుడిని కలుస్తారు.
కన్య ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. స్నేహితుల సహాయంతో మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో కొంత రిస్క్ తీసుకుంటేనే కలిసొస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
తులా ఈ రోజు మీరు కొంచెం గందరగోళంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. రాజకీయాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
వృశ్చికం వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరామవుతాయి. రాజకీయ వ్యక్తులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అధికారుల సహకారం లభిస్తుంది.
ధనుస్సు ఈ రోజు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా-బయటా మీ బాధ్యత పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఏదో ఒక విషయంలో విమర్శలు ఎదుర్కొంటారు.
మకరం ఈ రోజు మీరు కొత్త పని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. టెక్నికల్ రంగంలో పనిచేసే వారు లాభపడతారు. అధికారుల సహకారంతో మీ పనులు సాగుతాయి. కుటుంబ సభ్యుని పురోగతితో మీరు ఉత్సాహంగా ఉంటారు. ప్రమోషన్ పొందొచ్చు.
కుంభం ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది.వివాదాస్పద పరిస్థితులకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందుల్లో పడకతప్పదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
మీనం ఈ రోజు చురుకుగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకు శుభసమయం.