హరిచందనం చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం. అందుకే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.
పారిజాతం శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన వృక్షం ఇది. ఈ దేవతా వృక్షం పూలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.
మందారం మందార చెట్టునిండా పూలు పూస్తే అంతులేని సంపద పొందుతారని నమ్ముతుంటారు. మందార చెట్టు దేవతా వృక్షం. ఐదు కల్ప వృక్షాలలో మందార చెట్టు ఒకటి
మారేడు: మారేడు శివునికి ప్రీతికరం. అది దేవతా వృక్షమైనందునే దానిని కొన్ని రోజుల్లో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది.
రావి చెట్టు అంబరీష మహాముని శాపం వలన శ్రీమహావిష్ణువు అశ్వత్థ ( రావి) వృక్షంగా రూపాంతరం చెందాడని పద్మపురాణం చెబుతోంది. అందుకే శ్రీమహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు.
తులసి తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవత లు, అగ్రభాగంలో సర్వ వేదాలు కొలుఉంటాయని చెబుతారు.
కల్ప వృక్షం కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవ హరిస్తారు. అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారం భిస్తారు.