పూజిత పొన్నాడ.. కుర్రకారుకు ఎంతో ఇష్టమైన ఈ భామ మంచి గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది. టాలీవుడ్‌లో అవకాశాలు తక్కువైనా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను బాగానే సంపాదించుకుంది. పూజిత పుట్టింది విశాఖపట్నంలో, పెరిగింది చెన్నైలో. ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసి టాటా కన్సాల్టెన్సీ సర్వీసెస్‌లో చేరింది. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన పొన్నాడ, జాబ్ బోర్ కొట్టి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘దర్శకుడు’ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజితకు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ, అన్నీ చిన్న పాత్రలే. ‘రంగస్థలం’, ‘రాజుగాడు’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘రన్’, ‘మిస్ ఇండియా’, ‘కల్కీ’ చిత్రాల్లో నటించింది. ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’, ‘7-సెవన్’లో సినిమాల్లో హాట్ సీన్స్‌తో కుర్రాళ్ల మనసు దోచింది. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’, ‘ఒదెలా రైల్వే స్టేషన్’తోపాటు ‘భగవాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. Images Credit: Pujita Ponnada/Instagram