రోజర్ బిన్నీ, మదన్ లాల్ ఇద్దరూ కలిసి 1983 వరల్డ్ కప్‌లో 35 వికెట్లు పడగొట్టారు.

1999లో షేన్ వార్న్, మెక్‌గ్రాత్ బద్దలుకొట్టే వరకు ప్రపంచ కప్‌ల్లో ఇదే అత్యధిక బౌలింగ్ పార్ట్‌నర్‌షిప్.

ఒక వరల్డ్ కప్‌లో సెంచరీ, ఐదు వికెట్లు తీసిన మొదటి ఆటగాడు కపిల్ దేవ్.

2011లో యువరాజ్ సింగ్, కపిల్ సరసన చేరాడు.

కిర్మాణీ, కపిల్ అందించిన 126 పరుగుల భాగస్వామ్యం వరల్డ్ కప్ చరిత్రలోనే తొమ్మిదో వికెట్‌కు అత్యధికం.

ఈ రికార్డు ఇంకా అలాగే ఉంది. ఇప్పటివరకు బద్దలుకాలేదు.

సెమీఫైనల్, ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మొదటి ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్.

1996లో అరవింద డిసిల్వ, 1999లో షేన్ వార్న్ కూడా ఈ ఘనత సాధించారు.