చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2023 సీజన్‌లో తన సత్తా చూపించాడు. ఇప్పుడు తనకు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించిందని తెలుస్తోంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ టెస్టు జట్టులో ఉంటాడని టాక్. ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ 590 పరుగులు సాధించాడు. సగటు 42.14 కాగా, స్ట్రైక్ రేట్ 147.5గా ఉంది. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 92 పరుగులుగా ఉంది. ఈ స్కోరులో 46 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు.