మనం నిమిషానికి 20 సార్లు కంటి రెప్పలు ఆర్పుతాము, అంటే సంవత్సరానికి 10 మిలియన్ల సార్లన్నమాట జీవిత కాలంలో దాదాపుగా 40,000 లీటర్ల లాలాజలం తయారు చేస్తాం. రోజుకు 12 గంటల పాటు నడుస్తూ ఉంటే 690 రోజుల్లో ప్రపంచం చుట్టెయ్యొచ్చు. ఎప్పటికి అలసిపోనీ ఒకే ఒక కండరం గుండె. ప్రతి నిమిషం మన చర్మం 30,000 మృతకణాలను వదిలేస్తుంది. 70 సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తి గుండె 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. కొన్ని సార్లు మెదడు మెలకువగా ఉన్నప్పటి కంటే నిద్రలో చురుకుగా ఉంటుంది. మజిల్ అనే లాటిన్ టర్మ్ కి చిన్న ఎలుక అనే అర్థం.