ఒకప్పుడు టమోటాలు తినాలంటే భయపడేవారు



ఏ కూర వండినా, అందులో టమాటా ముక్కలు పడాల్సిందే. ఇక బిర్యానీలు, పులావులు అయితే టమోటా కచ్చితంగా ఉండాల్సిందే.



చరిత్రకారులు చెబుతున్న ప్రకారం దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో వాటిని మొదటిసారి పండించారని అంటారు.



క్రీస్తుశకం 700లోనే టమోటోలు పండినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆ టమోటోలు చాలా చేదుగా ఉండేవని, వాటిని తినేందుకు ఎంతోమంది భయపడేవారు అని అంటారు.



కాలం గడుస్తున్న కొద్దీ వీటి రుచి కూడా మారుతూ వచ్చిందని చెబుతారు.



ఒకప్పుడు టమోటాలను విషపూరితమైనవిగా చూసేవారు. వాటిని తినేవారు కాదు. మొక్కలను పీకి పడేసేవారు.



ఒకప్పుడు టమోటాలను విషపూరితమైనవిగా చూసేవారు. వాటిని తినేవారు కాదు. మొక్కలను పీకి పడేసేవారు.



మన దేశానికి మాత్రం టమోటోలను పరిచయం చేసింది పోర్చుగీసు వారని అంటారు.



ఇక్కడి ఉష్ణోగ్రతలు టమోటా పండడానికి సరిగ్గా సరిపోతాయి. భారత నేలల్లో టమోటాలు విరగ కాస్తాయి.