బంగాళాదుంప ఉడికించిన, కాల్చిన, కూర, చిప్స్ లేదా ఫ్రై రూపంలో ఎలా తిన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే బంగాళాదుంపలు అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. అందుకు కారణం ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అది మాత్రమే కాదు గ్లైసిమిక్ కలిగి ఉంటుంది. నిజానికి పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలు ఆరోగ్యకరమైనవి, పోషకమైనవి. ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బి6 వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. అన్నీ దుంపలు ఒకేలా ఉంటాయి. అవి ఆరోగ్యకరమా కాదా అనేది మనం వండుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. నూనెలో వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, కాల్చిన దుంపలు పోషకమైనవి కావు. బంగాళాదుంపలు వీలైనంత ఆరోగ్యంగా తినాలనుకుంటే డీప్ ఫ్రై చేయడానికి బదులుగా కాల్చుకోవచ్చు లేదంటే ఉడకబెట్టుకోవచ్చు. రోజూ బంగాళాదుంపలు తినడం వల్ల లాభాలు పొందవచ్చు. డీప్ ఫ్రై చేయకుండా ఉంటే మంచిది. ఇందులోని పీచు, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొటాషియం కండరాల పనితీరు నియంత్రిస్తుంది.