ఒకే సబ్బును ఇంటి సభ్యులంతా వాడవచ్చా?



నలుగురు ఉన్న కుటుంబంలో నాలుగు సబ్బులు వాడరు. ఒకే సబ్బును నలుగురూ వాడుకుంటారు.



ఒకే సబ్బుతో ఇంట్లోని సభ్యులంతా స్నానం చేయడం హానికరం అని చెబుతున్నాయి అధ్యయనాలు.



ఒకే కుటుంబంలో ఉన్నంత మాత్రాన... అందరూ ఒకే సబ్బును వాడాలన్న నియమం లేదు. కానీ ఎక్కువమంది చేసే పని ఇది.



ఒకరు ఒక సబ్బు వాడాక, ఆ సబ్బుపై కొన్ని రకాల సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ.



సబ్బుపై అధికంగా E. Coli, సాల్మొనెల్లా, షిగేల్లా వంటి బాక్టీరియాలు, నోరో వైరస్, రోటా వైరస్, స్టాఫ్ వైరస్ వంటి క్రిములు ఉండే అవకాశం ఉంది.



ఒకరు వాడిన సబ్బును మరొకరు వాడితే ఇలాంటివి వ్యాపించే అవకాశం ఎక్కువ.



దీనివల్ల బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారిలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. కాబట్టి ఒకరి సబ్బులను మరొకరు వాడకపోవడమే మంచిది.



ఒక్కొక్కరు ఒక్కో సబ్బు వాడే పరిస్థితి ఉండదు. అలాంటి వారు లిక్విడ్ సోపులను వాడితే మంచిది.