డ్రై షాంపూలతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్



డ్రై షాంపుల్లో క్యాన్సర్ కారకాలైన రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల అమెరికా మార్కెట్ నుంచి వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు యూనిలీవర్ సంస్థ ప్రకటించింది.



మన దేశంలోనే ప్రముఖ సంస్థల్లో హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి. ఇది సబ్బులు, షాంపూలు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది.



డ్రై షాంపుల్లో ఎన్నో మనదేశంలో కూడా దొరుకుతాయి. వీటిల్లో క్యాన్సర్ కారకమైన బెంజిన్ ఉన్నట్టు చెబుతోంది ఆ సంస్థ.



మన దగ్గర వీటి వినియోగం తక్కువగానే ఉన్నా... అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం వీటి వినియోగం చాలా ఎక్కువ.



ఇందులో ఉండే బెంజిన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం.



బెంజిన్... హెయిర్ డైలు, రసాయనాలు, డిటర్జెంట్లు, ప్లాస్టిక్, రబ్బర్లు వంటి తయారీలో ఉపయోగిస్తారు.



డ్రై షాంపూలను జుట్టుపై స్ప్రే చేసినప్పుడు బెంజీన్ గాలి ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది.



దీని వల్ల బ్లడ్ క్యాన్సర్, బోన్ మారో క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి వీటిని వాడడం మానేయడమే మంచిది.