వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇన్ని అనర్థాలా? కరోనా తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో విపరీత మార్పులు వచ్చాయి. పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కార్యాలయాలు ఉన్నాయి. కొత్తల్లో ఉద్యోగులంతా సంతోషించారు. దీర్ఘకాలంగా ఇలా వర్క్ ఫ్రం హోం చేసేవారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువమంది ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఒకే భంగిమలో ఉంటారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటారు. ఆఫీసులో అయితే మధ్య మధ్యలో స్నేహితులతో మాట్లాడడం, వారితో బయటికి టీ తాగడానికి వెళ్లడం, ఇటూ అటూ నడవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇంట్లో మాత్రం కదలకుండా ఎక్కువ గంటలసేపు కూర్చుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఎముకలు, కండరాలు, కీళ్ల సంబంధిత సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు గంటలు గంటలు కూర్చోవడం మానేయాలి. రెండు గంటలకు ఒకసారైనా లేచి అటూ ఇటూ పావుగంట సేపు తిరగాలి.