అక్షతా మూర్తి, రిషి సునాక్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అప్పుడే వాళ్ల లవ్‌స్టోరీ మొదలైంది.

నారాయణ మూర్తి వీరి ప్రేమను అర్థం చేసుకోవడమే కాదు తన కూతురుకు ఓ లేఖ కూడా రాశారు.

రిషి ఎంతో అందగాడని, తెలివైన వాడని అందుకే తన కూతురు ప్రేమించిందని చెప్పారు నారాయణ మూర్తి.

ఎంతో ఆలోచించాకే సునాక్‌ తన కూతురుకి పర్‌ఫెక్ట్ జోడీ అని నిర్ణయించుకున్నట్టు చెప్పారు నారాయణమూర్తి.

2009లో బెంగళూరులోని జయనగర్‌లో చామరాజ కల్యాణ మండపంలో వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది.

అక్షతా మూర్తి ఓ ఫ్యాషన్ డిజైనర్. సొంతగా అక్షతా ఫ్యాషన్స్‌ అనే కంపెనీని స్థాపించింది.

ట్యాక్స్‌ల విషయంలో అక్షతాపై ఆరోపణలు వచ్చిన సమయంలో రిషి ఆమెకు మద్దతుగా నిలబడ్డారు.

ఈ దంపతులకు ఇద్దరూ కూతుళ్లే. వాళ్ల పేర్లు కృష్ణ, అనౌష్క. (Image Credits: Shethepeople, Vouge)