మహారాష్ట్ర, గుజరాత్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించారు. వందేభారత్ ట్రైన్‌లో స్వయంగా ప్రధాని మోదీ ప్రయాణించారు కూడా. ఇటీవల ఓ పశువుల మందను వందే భారత్ ట్రైన్ ఢీకొట్టటం వల్ల ముందు భాగం డ్యామేజ్ అయింది. ఈ ఘటనతో వందేభారత్ రైళ్ల క్వాలిటీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు భాజపాను ట్రోల్ చేయడంతో వెంటనే మరమ్మతులు మొదలు పెట్టారు. డ్యామేజ్ అయిన ముందు భాగాన్ని చాలా వేగంగా రిపేర్ చేసి మళ్లీ ట్రాక్ మీదకు తీసుకొచ్చారు. రిపేర్ పూర్తైన వెంటనే సోషల్ మీడియాలో ఫొటోలో పోస్ట్ చేసి విమర్శలకు చెక్ పెట్టారు. దీనంతటికీ కారణమైన పశువుల యజమానులపై గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు పెట్టింది.