రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుకుంది. మాండ్యాలో మొదలైన ఈ యాత్రలో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. సోనియా కొంతదూరం వరకూ రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. ఆమె రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. ఆరోగ్య సమస్యల కారణంగా పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు సోనియా. బళ్లారిలో ఓ భారీ ర్యాలీలో సోనియా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం వల్ల కాంగ్రెస్ కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాహుల్ గాంధీ తన తల్లి షూ లేస్ కట్టుకోవడంలో సాయం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటకలో కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సోనియా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. (Image Credits: Twitter)