ఈ ఫెస్టివల్‌నే ’టమోటినా’ అని పిలుస్తారు. ఈ సందర్భంగా వందల మంది ఒకచోట చేరి టమోటాలను ఒకిరిపై ఒకరు విసురుకుంటూ సందడి చేస్తారు. ఈ ఫెస్టివల్‌లో శత్రువులు, మిత్రులు అంతా ఒక్కటైపోతారు. ప్రతి ఒక్కరూ తమ బాధల్ని మర్చిపోయి ఆనందంగా గడుపుతారు. ఈ ఫెస్టివల్‌కు చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది 1944లోనే స్పెయిన్‌లో మొదలైంది. తరవాత ఒక్కో దేశానికి ఇది విస్తరించింది. ఒక్కో చోట కనీసం 120 టన్నుల టమాటాలను ఈ ఫెస్టివల్ కోసం వినియోగిస్తారు. స్పెయిన్‌లోని బునోల్ విలేజ్ ఈ ఫెస్టివల్‌కు చాలా ఫేమస్. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ ఫెస్టివల్ వాయిదా పడింది. అందుకే ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పండుగ చేసుకుంటున్నారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని ఆన్‌లైన్ సైట్‌లు ఉంటాయి. ఇలా కొట్టుకుంటున్నారేంటి అని ఎవరు ఎలా అనుకున్నా ఇందులోనే మజా వెతుక్కుంటారు వీళ్లంతా. చాలా రిలాక్స్ అయిపోతారు. ఇందులో పాల్గొనేందుకు ఎంతో మంది పర్యాటకులు స్పెయిన్‌కు తరలి వెళ్తుంటారు. (Image Credits: Twitter)