సరిగ్గా ఆర్నెల్ల క్రితం రష్యా..ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. రష్యా సేనలు చేస్తున్న దాడిలో ఉక్రెయిన్ పౌరుల జీవనం అస్తవ్యస్తమైంది. చిన్నారులూ ఈ నరమేధానికి బలి అవుతున్నారు. బిల్డింగ్‌లు, ఇళ్లపైన బాంబుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా సేనలతో పోరాడలేక ఉక్రెయిన్ సైన్యం కలవర పడుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాతో గట్టిగానే పోరాడుతున్నారు. దేశంలోని భయానక వాతావరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది అయిన వాళ్లను వదిలేసి వెళ్లిపోతున్నారు. దేశమంతా ఇలా కూలిపోయిన భవంతులే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. (Images Credits: AP, Getty Images, EPA, PTI)