1937-48 మధ్యలో నోబెల్ శాంతి పురస్కారానికి 5 సార్లు నామినేట్ అయ్యారు బాపూజీ. అయినా ఆ అవార్డు దక్కలేదు.

నోబెల్ శాంతి పురస్కారానికి అన్ని విధాలా గాంధీజీ అర్హుడు అని మద్దతు లభించినా ఆ కల తీరలేదు.

1960 వరకూ నోబెల్ పీస్ ప్రైజ్ కేవలం యూరోపియన్లు, అమెరిన్లకు మాత్రమే ఇచ్చేవారు.

గాంధీ గొప్ప వ్యక్తే అయినా తన విధానాలు మార్చుకుంటారన్న కారణంతో నోబెల్ కమిటీ ఆయన పేరుని పక్కన పెట్టింది.

1947లో గాంధీని నామినేట్ చేసినా..దేశ విభజన, హింస లాంటి పరిణామాల నేపథ్యంలో పురస్కారం అందజేయలేదు.

గాంధీ కేవలం భారతీయుల కోసమే పోరాడారని, అంతర్జాతీయ శాంతి కోసం కృషి చేయలేదని నోబెల్ కమిటీ భావించింది.

గాంధీజీ పాసిఫిస్ట్గా ఉండటంలో కొన్ని సార్లు విఫలమయ్యారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.

చివరకు 1948లో గాంధీజీకి నోబెల్ శాంతి పురస్కారం అందించాలని నిర్ణయించినా అదే ఏడాది ఆయన హత్యకు గురయ్యారు.

ఈ కారణాల వల్లే బాపూజీకి నోబెల్ పురస్కారం దక్కలేదు. (Image Credits: Wikipedia, Wikimedia, Pixabay)