1764లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్‌లో తొలి పోస్టాఫీస్‌ను కలకత్తాలో ప్రారంభించింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి గాంధీ బొమ్మను 1948లో పోస్ట్ స్టాంప్‌పై ముద్రించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హిక్కిం పోస్టాఫీస్ ప్రపంచంలోనే ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది. ఎయిర్‌మెయిల్ స్టాంప్స్ అందుబాటులోకి తెచ్చిన తొలి కామన్‌వెల్త్ దేశం భారత్. ప్రపంచంలోనే తొలి ఎయిర్‌మెయిల్ వెళ్లింది ఇండియా నుంచే. అలహాబాద్ నుంచి నైనికి ఇది చేరుకుంది. ఇండియన్ పోస్ట్‌లో ఆరంకెల పిన్‌కోడ్‌ను 1972 ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఉంది. డిజిటల్ విప్లవంతో టెలిగ్రామ్, మనీ ఆర్డర్ సేవల్ని నిలిపివేశారు. (Image Credits: ET, Newsflicks,linns)