అందమైన అమ్మాయిలో ఇంత రాక్షసత్వమా!
సత్యభామ సీరియల్ లో మైత్రిగా నటిస్తోన్న ఈ అమ్మాయి పేరు మౌనిక సామినేని
సీరియల్ ఆరంభంలో మైత్రిని చూసి అమాయకమైన అందమైన పిల్ల అనుకున్నారంతా
హర్షను ప్రేమించి పెళ్లిచేసుకోవాలని ఆశపడింది..కానీ అనుకోని కారణాలతో హర్ష పెళ్లి నందినితో జరిగింది
తల్లిదండ్రులు పోయిన తర్వాత హర్ష ఇంట్లో తిష్టవేసి కాపురాన్ని ముక్కలు చేయాలి అనుకుంది మైత్రి
నందిని ప్రేమకు, త్యాగానికి ఫిదా అయిపోయిన హర్ష..మైత్రిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు
ఇప్పటివరకూ అమాయకంగా నటించిన మైత్రి..తనలో రాక్షసత్వాన్ని హర్షకి చూపించింది
అనాథాశ్రమం బాధ్యతలు అప్పగించేందుకు ఇంటికి రమ్మని చెప్పి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిఇచ్చి ట్రాప్ చేసింది
మత్తులో ఉన్న హర్షతో సెల్ఫీలు తీసుకుని రివర్స్ లో బెదిరింపులకు దిగింది..
ఇన్నాళ్లూ మైత్రని సపోర్ట్ చేసి నందినిపై ఫైర్ అయిన హర్ష తీరు ఇకపై ఎలా ఉంటుందో చూడాలి