మామ, తండ్రితో సత్యభామ సీరియల్ సంధ్య రీల్స్ చూశారా!

పలు సీరియల్స్ లో నటించిన అఖిల సత్యభామ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయింది

నిన్నటి వరకూ సత్యకు చెల్లెలు క్యారెక్టర్లో అమాయకంగా కనిపించిన సంధ్య..ఇప్పుడు విలన్ అవతారమెత్తింది

సత్యకు చెక్ పెట్టేందుకు మహదేవయ్య - సంజయ్ వేసిన ప్లాన్ లో చిక్కుకుని అక్కపై చెలరేగిపోతోంది సంధ్య

ఇక సీరియల్ సంగతి వదిలేస్తే..షూటింగ్ సెట్ లో చిన్న విరామం దొరికినా ఇలా రీల్స్ తో సంధ్య బిజీ బిజీ

సీరియల్ లో మావయ్యగా నటిస్తోన్న మహేదేవయ్యతో సంధ్య చేసిన ఈ రీల్ భలే కామెడీగా ఉంది

తండ్రి విశ్వనాథాన్ని ఎదిరించి మాట్లాడే సంధ్య... సెట్ లో తనతో కలసి ఫన్నీగా ఇలా రీల్ చేసి పోస్ట్ చేసింది

సత్యభామ సీరియల్ లో నిన్నటివరకూ సైడ్ క్యారెక్టర్లా అనిపించిన సంధ్య.. ప్రస్తుతం అక్కతో ఢీ అంటే ఢీ అంటోంది

సంధ్య క్యారెక్టర్లో అఖిల నటన చూస్తుంటే ...ఫ్యూచర్లో సపోర్టింగ్ రోల్ కాదు..లీడ్ క్యారెక్టర్లోనే నటించే ఛాన్స్ అందుకుంటుందేమో