బ్రహ్మముడి సీరియల్ లో చిరాగ్గా ఉంటుంది కానీ.. గోదారి గట్టుమీద రామచిలుకలా అదిరిపోయిన అనామిక!

బ్రహ్మముడి సీరియల్ లో అనామికగా నటిస్తోన్న నిఖితా చౌదరి సీరియల్ కి రుద్రాణి తర్వాత మరో విలన్

కళ్యాణ్ వెంటపడి ప్రేమించి...పెళ్లి చేసుకుని రుద్రాణి మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న క్యారెక్టర్లో నటించింది

దుగ్గిరాల వారి ఫ్యామిలీపై రివెంజ్ తీర్చుకునేందుకు స్కెచ్చుల మీద స్కెచ్చులేస్తుంటుంది

సీరియల్ లో చిరాగ్గా ఉంటుంది కానీ ఇలా రీల్స్ లో మాంచి జోష్ మీదుంటుంది

బ్రహ్మముడి సీరియల్కి లో అనామిక గా నటించేముందు ఇంటికిదీపం ఇల్లాలు సీరియల్ లో నటించింది నిఖితా చౌదరి

తను నటించే సీరియల్స్ టీమ్ తో షూటింగ్ గ్యాప్ లో ఇలా రీల్స్ చితక్కొట్టేస్తుంది...

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను అనే లిరిక్స్ కి ఇలా బీచ్ లో కూల్ గా కూర్చుని రీల్ చేసేసింది

లంగాఓణీలో ముద్దుగా కనిపించే అనామిక.. నేనున్నాను మూవీలో శ్రియలా ఇలా ట్రై చేసింది....

బ్రహ్మముడిలో పొగరుగా కనిపించే అనామిక ట్రెడిషనల్ లుక్ లో ముద్దుగా ఉంటుంది...