కార్తీకదీపం డాక్టర్ బాబుని గుర్తుపెట్టుకున్నారు..డాక్టరమ్మ బర్త్ డే అని కూడా మర్చిపోయారా!

కార్తీకదీపం మోనిత, బిగ్ బాస్ శోభా శెట్టి పుట్టినరోజు సందర్భంగా దగ్గరుండి కేక్ కట్ చేయించారు స్నేహితులు

జానకి కలగనలేదు సీరియల్ ఫేం అమరదీప్, ప్రియాంక జైన్ తో పాటూ టేస్టీ తేజా ముగ్గురూ కలసి శోభా బర్త్ డే సెలబ్రేట్ చేశారు

శోభా శెట్టి చాలా సంతోషంగా కనిపించింది.. ప్రియాంక, అమర్ దీప్, తేజాతో బాగా ఎంజాయ్ చేసింది శోభా శెట్టి

శోభాశెట్టి అనేకన్నా కార్తీకదీపం మోనిత అనగానే స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేస్తుంది

కార్తీకదీపంలో విలన్ గా నటించిన శోభిత..ఏళ్లతరబడి సక్సెస్ ఫుల్ గా సీరియల్ ఓ వెలుగువెలిగేందుకు క్యారెక్టర్ కు ప్రాణం పోసింది

మోనిత క్యారెక్టర్లో ఎంతలా మునిగిపోయిందంటే..నిజంగా బయట శోభా కనిపించినా దాడిచేసేంతలా జీవించేసింది

సోషల్ మీడియా చర్చల్లోనూ డాక్టర్ బాబుని వదిలెయ్ మోనిత అంటూ పదే పదే రిక్వెస్టులు పెట్టేవారు నెటిజన్లు

ఓ దశలో తనపేరు శోభాశెట్టి అనికూడా మర్చిపోయారు ప్రేక్షకులు..మోనితగానే ఫిక్సైపోయారు

ఇప్పుడు కార్తీకదీపం నవవసంతం సీరియల్ వస్తోంది..డాక్టర్ బాబు వంటలక్క ఉన్నారు కానీ ఇందులో మోనిత లేదు...