'కోయిలమ్మ' స్రవంతితో 'గుప్పెడంతమనసు' సాయికిరణ్ పెళ్లి!
సీరియల్ నటి స్రవంతిని పెళ్లి చేసుకుంటున్నాడు గుప్పెడంత మనసు మహేంద్ర భూషణ్ ( సాయికిరణ్)
కోయిలమ్మ సీరియల్ లో మనోజ్ గా నటించిన సాయికిరణ్ కి అన్నయ్య భార్యగా నటించింది స్రవంతి..
కోయిలమ్మ సీరియల్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారింది..నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట డిసెంబరు 7 న పెళ్లిచేసుకుంటున్నారు
నువ్వేకావాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సాయికిరణ్.. అనగనగా ఆకాశం ఉంది సాంగ్ అప్పట్లో యూత్ ని ఊపేసింది
నువ్వేకావాలి తర్వాత వరుస సినిమాల్లో నటించాడు..మూవీస్ సక్సెస్ అయినా ఆశించిన స్థాయిలో స్టార్ స్టేటస్ అందులేకపోయాడు
సినిమాలకు స్వస్తి చెప్పి సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్..తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ బిజీగా ఉన్నాడు
గతంలో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్న సాయికిరణ్ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు స్రవంతిని జీవితంలోకి ఆహ్వానించారు
సింగర్ సుశీలకు మనవడి వరసయ్యే సాయికిరణ్..ఒకప్పటి సింగర్ రామకృష్ణ తనయుడు.