'భానుమతి' సీరియల్ లో బలరాం శారదగా సాయికిరణ్ స్రవంతి
స్టార్ మా లో కొత్తగా ప్రారంభమైన భానుమతి సీరియల్ లో బలరాం - శ్రద్ధగా నటిస్తున్నారు సాయికిరణ్, స్రవంతి
కేవలం సీరియల్ లో మాత్రమే కాదు..వీళ్లిద్దరూ రియల్ కపుల్
కోయిలమ్మ సీరియల్ లో వదిన, మరిదిగా నటించిన సాయికిరణ్, స్రవంతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
సాయికిరణ్ నువ్వేకావాలితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' సహా పలు మూవీస్ లో నటించాడు
కోయిలమ్మ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై క్రేజ్ సొంతం చేసుకున్న సాయికిరణ్.. గుప్పెడంత మనసులో రిషి తండ్రి మహేంద్ర భూషణ్ గా నటించాడు.
ప్రస్తుతం వీళ్లిద్దరూ భానుమతి సీరియల్ లో నటిస్తున్నారు. ఇందులో భార్యగా నటిస్తోంది రియల్ భార్య స్రవంతి
పెళ్లిచేసుకున్న తర్వాత వీళ్లద్దరూ రీల్ జోడీగా నటిస్తున్న భానుమతి సీరియల్ సాయికిరణ్, స్రవంతికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో