బ్రహ్మముడిలో అనామిక కేరెక్టర్ కి శుభం కార్డ్!
కవి కళ్యాణ్ వెంటపడి ప్రేమించే అందమైన అల్లరి ప్రేమికురాలిగా బ్రహ్మముడి సీరియల్ లో ఎంట్రీ ఇచ్చింది అనామిక
ప్రేమించి పెద్దలను ఒప్పింది పెళ్లిచేసుకుంది..డబ్బుకోసమే ఇదంతా అని క్లారిటీ ఇచ్చేసింది
కళ్యాణ్ ని తనవైపు తిప్పుకుని ఆస్తి కొట్టేద్దాం అన్న ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయింది
దుగ్గిరాలవారింటిపై పగబట్టి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగేందుకు సామంత్ ని అడ్డుపెట్టుకుంది
కాలేజీ చదువుకునే రోజుల్లో ప్రేమించిన అనామిక ఇన్నాళ్లకు తనవద్దకు వచ్చిందంటూ సామంత్ పొంగిపోయాడు
అనామిక చెప్పినట్టు ఆడాడు..చివరకు అనామిక మోసం తెలుసుకుని నిలదీసేసరికి ఆమె చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు
ఆ కేసును రాజ్ పైకి నెట్టేసి డ్రామాలు ఆడింది..ఆఖరి నిముషంలో నిజం బయటపడి అనామిక జైలుకి పోయింది
ఇంతకు రెట్టింపు పగ తీర్చుకుంటా అంటూ శపథం చేసి నిష్క్రమించింది అనామిక..