ఇలాంటి ఆడపడుచు ఇంటికొకరు ఉంటే చాలురా బాబోయ్!
రుద్రాణి.. అందమైన రాక్షసి.. బ్రహ్మముడి సీరియల్ లో ఈ క్యారెక్టర్ చేస్తోంది షర్మిత గౌడ..ఎంత అందంగా ఉంటుందో అంత రచ్చ బ్యాచ్.
తన స్వార్థం కోసం తనకు ఆశ్రయమిచ్చిన కుటుంబాన్నే ఆడేసుకుంటున్న క్యారెక్టర్లో షర్మిత గౌడ ఇరగదీస్తోంది.. బాబోయ్ అనిపిస్తోంది
ఎలాంటి పరిస్థితుల్లో అయినా... కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా..రుద్రాణి టార్గెట్ మాత్రం గొడవే
కుటుంబంలో ఎవరినీ ఎవరికీ కాకుండా చేసి ..లేని పోని గొడవలు సృష్టించి హమ్మయ్య అనుకుంటుంది...
ఇప్పటికే రాహుల్ - స్వప్న మధ్య చిచ్చు పెట్టినా స్వప్న గొంతుకి భయపడి వెనకడుగువేస్తుంటుంది...
ఇక కవి కళ్యాణ్- అప్పుని ఇంట్లోంచి పంపించేసింది.. ఆ విషయం అర్థంకాని ధాన్యలక్ష్మి రుద్రాణి ఉచ్చులో చిక్కుకుని ఇంకా బయటపడలేదు
ఇంట్లో కావ్య అన్నింటికి అడ్డుగా ఉంటోందని ఆలోచించి రాజ్ తోనే కావ్యను వెళ్లగొట్టేలా చేసింది...
రాజ్-కావ్య ఎక్కడ కలసిపోతారో అనే భయంలో ఉన్న సమయంలో..కనకం క్యాన్సర్ డ్రామా మొదలెట్టింది...
ఎట్టకేలకు ఆ డ్రామాను గురించి తెలుసుకున్న రుద్రాణి..మూడు జంటలు ముచ్చటగా కూర్చుని వ్రతం చేసుకుంటుంటే రచ్చ మొదలెట్టింది
ఇలాంటి ఆడపడుచు ఇంటికొకరు ఉంటే చాలురా బాబోయ్ అంటున్నారు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు..