బిగ్‌బాస్ ఫేం, 'బ్రహ్మముడి' సీరియల్ హీరో మానస్ త్వరలో తండ్రి కాబోతున్నాడు మానస్ నాగులపల్లి భార్య శ్రీజ గర్భవతిగా ఉంది ఇక జూన్ 22న మానస్ భార్య శ్రీజ సీమంతం వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది ఈ వేడుకలో బిగ్‌బాస్ ఫేం, ఆర్జే కాజల్ పాల్గొని సందడి చేసింది కాబోయే తల్లిదండ్రులు మానస్, శ్రీజలు బహుమతులు అందజేసింది అంతేకాదు వారిద్దరితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది మానస్ భార్య సీమంతం వేడుకకు సంబంధించిన వీడియోను కాజల్ తన ఇన్స్టాలో షేర్ చేసింది ఇందులో మానస్ భార్యకు పిండి వంటలు, గాజులు బహుమతిగా ఇచ్చింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా మానస్-శ్రీజలు గతేడాది నవంబర్‌లో పెద్దల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు