నన్ను ప్రేమించండి కానీ తనతో లింక్ చేయకండి - బిగ్ బాస్ నిఖిల్ పోస్ట్ వైరల్

మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిఖిల్..ఓ రిక్వెస్ట్ చేశాడు

మేం ఇద్దరం విడిపోయాం..ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నాం..దయచేసి మమ్మల్ని కలిపి చూడొద్దు

ఇండివిడ్యువల్ గా సపోర్ట్ చేయండి , ప్రేమించండి.. కానీ ఇద్దర్నీ లింక్ చేయకండి అని పోస్ట్ చేశాడు..

బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గోరింటాకు సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు

ఈ సీరియల్ లో జోడీగా నటించిన కావ్యతో ప్రేమలో పడ్డాడు..త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చింది

నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లకముందు ఇద్దరి మధ్యా బ్రేకప్ అయింది..

బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరూ కలసిపోతారు అనుకున్నారంతా

ఇద్దరి మధ్యా దూరం మరింత పెరిగింది కానీ తగ్గలేదు..ప్రస్తుతం ఎవరి కెరీర్లో వాళ్లు బిజీగా ఉన్నారు

నన్ను వేరే ఏ పోస్టులతోనూ ఎవరితోనూ లింక్ చేయవద్దు..అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అని పోస్ట్ చేశాడు