కుంభమేళాలోనూ అదే పనా జానకి!

కొన్నిరోజులుగా ఆలయాలు, ఆధ్యాత్మిక యాత్రలు అంటున్న ప్రియాంక జైన్ కుంభమేళాలో ప్రత్యక్షమైంది

తన ప్రియుడు, స్మాల్ స్క్రీన్ నటుడు శివకుమార్ తో కలసి త్రివేణి సంగమంలో స్నానమాచరించింది

ప్రయాగరాజ్ లో పుణ్యస్నానం అనంతరం కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు ఈ స్మాల్ స్క్రీన్ జోడీ

కుంభమేళాలో ఫొటోస్, రీల్స్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది ప్రియాంక జైన్

ఈ ఫొటోస్, రీల్స్ చూసిన నెటిజన్ల రియాక్షన్ విభిన్నంగా ఉంది..మీ భక్తికి ఫిదా అని కొందరు పోస్టులు పెట్టారు

పవిత్ర ప్రదేశంలోనూ ఫొటోస్, రీల్స్ అవసరమా..ఈ పిచ్చి పోదా అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు

మీరు ఆ ప్రదేశానిక భక్తితో వెళ్లారా..అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వెళ్లారా అని మరికొందరు అన్నారు

ప్రియాంక జైన్ శివకుమార్ ఇద్దరూ కలసి మౌనరాగం సీరియల్ లో నటించారు..

మౌన రాగం తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో జానకిగా నటించి ఫాలోయింగ్ పెంచుకుంది ప్రియాంక జైన్