వయసు 30కి చేరేనాటికి అటు వృత్తి పరంగానూ ఇటు వ్యక్తిగతంగానూ చాలా బాధ్యతలు పెరిగిపోతాయి.

బాధ్యతల నడుమ ఆరోగ్యం చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు.

తరచుగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లకుండా నివారించుకోవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా కేవలం ఎల్డీఎల్ స్థాయిలు , ట్రైగ్లిజరాయిడ్స్, హెచ్డీఎల్ స్థాయిల వంటి ఇతర విషయాలు కూడా తెలుసుకోవచ్చు.

తరచుగా బీపీ పరీక్షించుకోవడం వల్ల రక్తపోటు లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

బీపీ రీడింగ్స్ అసాధారణంగా ఉంటే వీలైనంత త్వరగా మందులు వాడడం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది.

ఈసీజీ, ఇకో వంటి గుండె పరీక్షలు కూడా చేయించుకోవాలి . గుండె పనితీరులో ఏదైనా మార్పు ఉంటే కనిపెట్టేందుకు తోడ్పడుతాయి.

పాప్ స్మీయర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు స్త్రీలకు తప్పనిసరి. అలాగే పురుషులు ప్రొస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

30 ల్లో ఏడాదికి ఒకసారి హెచ్ బీఏ1సి పరీక్ష ద్వారా డయాబెటిస్ రిస్క్ ఎంతవరకో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

థైరాయిడ్ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, లివర్ పరీక్ష తప్పకుండా ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి.

Representational Image : Pexels