ఒత్తిడి మానసిక శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

ఒక అద్యయనం ప్రకారం మానసిక ఒత్తిడి చర్మ ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుందని తేలింది.

సోరియాసిస్, ఎక్జిమా, మొటిమల వంటి చర్మ సమస్యలే కాదు జుట్టు రాలిపోయ్యేందుకు కూడా మానసిక ఒత్తిడి కారణమవుతుంది.

మెడిటేషన్ వంటి రిలాక్సింగ్ టెక్నిక్స్ సోరియాసిస్ తో బాధపడేవారిలో మంచి ఫలితాలను ఇచ్చాయట.

ఒత్తిడి తగ్గించుకోకుండా, సరైన ఆహార అలవాట్లు లేకుండా స్కిన్ కేర్ మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వలేదని నిపుణులు చెబుతున్నారు.

సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యవంతమైన జీవనశైలి కలిగి ఉంటే స్ట్రెస్ హార్మోన్లు బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.

అందమైన చర్మం కావాలనుకుంటే ఒత్తిడి తగ్గించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవన శైలి ఉండడం చాలా అవసరం.

Representational Image : Pexels