స్వీట కార్న్ లో ఫైబర్ ఎక్కువ. అందువల్ల జీర్ణవ్యవస్థ బావుంటుంది. స్వీట్ కార్న్ లో ల్యూటెయిన్, గ్జీయాంతైన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుష్కలం. కంటి ఆరోగ్యానికి మంచిది. పొటాషియం, థయామిన్, నియాసిన్, విటమిన్ సి, ఇతర ఖనిజలవణాలు కూడా స్వీట్ కార్న్ లో ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది కనుక పోషణ విషయంలో రాజీ పడకుండా బరువు తగ్గాలనుకుంటే మంచి స్వీట్ కార్న్ మంచి ఆప్షన్. మధుమేహులు పరిమితుల్లో స్వీట్ కార్న్ తీసుకోవాలి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయని మరిచిపోవద్దు. పరిమితుల్లో తీసుకుంటే మధుమేహులకు మంచి ప్రొటీన్ స్వీట్ కార్న్ ద్వారా పొందవచ్చు. గర్భవతులకు అవసరమయ్యే ఫోలిక్ ఆసిడ్ స్వీట్ కార్న్ లో ఉంటుంది. కనుక తప్పకుండా తీసుకోవాలి. Representational Image : Pexels