ఋతుచక్రం ప్రతి స్థాయిలో కూడా వజైనల్ డిశ్చార్జ్ లో రకరకాల పరిణామాలు జరుగుతుంటాయి. గుడ్డులోని తెల్ల సొన వంటి స్రావాలు ఓవ్యులేషన్ సమయాన్ని సూచిస్తుంది. కాస్త రక్తం కలిసిన ఎరుపు లేదా జేగురురంగు డిశ్చార్జ్ క్రమరహితమైన నెలసరులు కలిగిన వారిలో కనిపిస్తాయి. ఓవ్యులేషన్ కు ముందు యోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు క్రీమీ మిల్క్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. లేత పసుపు నుంచి నియాన్ ఆకుపచ్చ రంగు డిశ్చార్జ్ కనిపిస్తే ట్రైకోమోనియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. దుర్వాసన, దురద, మూత్ర విసర్జనలో బాధ ఉంటుంది. గులాబి రంగు డిశ్చార్జ్ కనిపిస్తే నెలసరికి సూచన. లేదా గర్భాశయంలో పాలిప్స్ వంటి సమస్యల్లో కూడా కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గర్భాశయంలో నాన్ క్యాన్సరస్ కణితులకు సూచన కావచ్చు. గ్రేకలర్ డిశ్చార్జ్ తీవ్రమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సూచన. Representational Image : Pexels