మానవ శరీరం 70 శాతం వరకు నీటితో ఉంటుంది. పోషకాల శోషణకు, జీవక్రియల మెరుగుదలకు నీళ్లే అవసరం. జీర్ణక్రియకు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీళ్లు తాగే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు తీవ్రం కావచ్చు. నీళ్లు శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి పంపడానికి, శరీర ఉష్ణోగ్రతను మేనేజ్ చెసేందుకు చాలా అవసరం. నీళ్లను చాలా వేగంగా తాగితే శరీరం షాక్ కు గురవుతుంది. అందువల్ల కడుపులోని నాడులు ఒత్తిడికి గురవతాయి. నెమ్మదిగా ఒక్కోగుక్కగా తాగాలి. నీళ్లు ఎప్పుడైనా భోజనానికి ముందు లేదా తర్వాత 45 నిమిషాల తేడాలో తాగాలి. ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువ కాలం పాటు నిలువ ఉంచిన నీళ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం కావచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు పురుషుల్లో వీర్య నాణ్యత మీద ప్రభావం చూపిస్తాయి. బాలికల్లో ప్యూబర్టీ సమస్యలు రావచ్చు. Representational Image : Pexels