మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో కచ్చితంగా ఇమ్యూనిటి తగ్గిపోతుంది. ఇందుకు అవసరమయ్యే కొన్ని ఆయుర్వేద పానీయాల గురించి తెలుసుకుందాం. తులసిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కనుక రోజూ తులసి టీ తీసుకోవడం మంచిది. అల్లం, నిమ్మతో చేసిన టీతో శక్తి పెరుగుతుంది. అల్లం, నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు నివారిస్తాయి. వెచ్చని పాలలో పసుపు కలిపి తాగితే రోగ నిరోధక జీర్ణక్రియ కూడా సజావుగా జరుగుతుంది. పాలు పసుపు కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి. ఉసిరిలో యాంటీ-ఇన్‌ఫ్లిమేటరీ లక్షణాలు, విటమిన్-C ఉంటాయి. ఉసరి రసంతో జీర్ణక్రియకు, ఇమ్యూనిటికి మంచిది. దాల్చిన చెక్క, తేనె కలిపిన నీటిని తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. Representational Image : Pexels