ఆయుర్వేదం శతాబ్ధాలుగా ఆరోగ్యం మాత్రమే కాదు సౌందర్య పోషణలోనూ చక్కని మార్గాలు సూచిస్తుంది. కలబంద పీహెచ్ సంతులన పరచి తలమీద చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. మందారంలో బోలెడు యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆసిడ్లు ఉంటాయి. మందారంతో జుట్టు బాగా పెరుగుతుంది. బ్రహ్మీలో కాల్షియం, విటమిన్ సి, జింక్, అల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. గోతు కోల అనే మూలిక స్కాల్స్ కి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తులసి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు త్వరగా నెరవదు. పుదీన నూనె రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. తలదురదలు, పొడిబారే సమస్యలకు పరిష్కారం. కొన్ని చుక్కల రోజ్ మేరి నూనెను ఆలీవ్ నూనెలో కలిపి నేరుగా మాడుకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. Representational Image : Pexels