వారినికి ఒకరోజు బద్దకంగా ఉంటే పర్లేదని నిపుణులు చెబుతున్నారు. అదేమిటో తెలుసుకుందాం. బద్దకంగా గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. అన్నీ వదిలి బద్దకంగా ఉండడం వల్ల మనసు శరీరం రిలాక్స్ అవుతాయి. మానసికంగా ఒక బ్రేక్ దొరికినట్టు ఉంటుంది. వారమంతా పడిన ఒత్తిడి నుంచి ఒక ఉపశమనం అనుకోవచ్చు. క్రమం తప్పకుండా పనినుంచి బ్రేక్ తీసుకుంటూ ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది. తిరిగి పనిలో ఏకాగ్రతతో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. రిలాక్స్ వల్ల శారీరకంగా కూడా మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కండరాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఒక్కోసారి బద్దకంలో కొత్త ఐడియాలు తడుతుంటాయి. సృజనాత్మక శక్తి మెరుగవుతుంది. మీకు మీరు సమయం కేటాయించుకుంటారు కనుక ఆత్మీయులతో అనుబంధాలు కూడా మెరుగుపడతాయి. ఒకరోజు రిలాక్సవడం వల్ల మరింత మోటివేటెడ్ గా కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధపడతారు. వారంలో ఒకరోజు బద్దకం తీరిక లేని లైఫ్ స్టైల్‌లో ఒక బ్రేక్ ఇవ్వడం వల్ల జీవన శైలి కూడా కాస్త మెరుగుపడుతుంది. రిలాక్స్ డ్ గా ఉండడం వల్ల మంచి నిద్ర పొయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది అన్ని రకాలుగానూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Representational Image : Pexls