పసుపు లేకుండా భారతీయుల వంట పూర్తికాదని అంటే అతిశయోక్తి కాదు.

నొప్పి, వాపు తగ్గించే గుణాలు పసుపులో ఉన్నాయని అనాదిగా ప్రతీతి.

అయితే ఈ వాదనకు తగినన్ని శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పసుపులో ఉన్నాయని చెప్పుకునే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలన్నీ కూడా మనుషుల్లో పనిచేసినట్టు రుజువులు లేవట.

కొంత మందిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పసుపు వాడితే లివర్ ను దెబ్బతీసే విషంగా పరిణమిస్తుంది.

ఇది అత్యంత ప్రమాదకరం, ప్రాణాపాయం కూడా కలగవచ్చట.

పసుపు ఎక్కువగా వాడితే వికారం, తలతిరగడం, విరేచనాల వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

పసుపు పరిమితికి మించి వినియోగిస్తే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

పసుపు రోజుకు 500-2000 మి.గ్రా. మించకుండా తీసుకోవాలి.

Representational Image : Pexels