మనం తీసుకున్న ఆహారం అరగకపోతే పుల్లటి త్రేన్పులు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది.



ఒక్కోసారి సమస్య తీవ్ర రూపం దాల్చి గ్యాస్ గుండెకి కొట్టే ప్రమాదం ఉంది.
కానీ అజీర్తి సమస్యలు తగ్గించుకునేందుకు ఈ ఒక్క మసాలా చాలని అంటున్నారు నిపుణులు.


గ్యాస్, ఉబ్బరం వంటి పొట్ట సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది.



ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్
, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పసుపుని ఔషధంగా మార్చాయి.


పేగు సిండ్రోమ్, డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలని పసుపు నయం చేస్తుంది.
కర్కుమిన్, ఒమెప్రజోల్ అజీర్తిని తగ్గిస్తాయి.


ఇదే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. 206 మంది మీద పరిశోధన జరిపారు.



పసుపు తీసుకున్న వారిలో అజీర్తి సమస్యలు తగ్గుముఖం పట్టాయి.



కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచేందుకు
సహాయపడుతుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి.


జలుబు, దగ్గుని తగ్గించుకునేందుకు పసుపు కలిపిన పాలు తాగితే సత్వర ఉపశమనం లభిస్తుంది.



Images Credit: Pexels