చపాతీ పిండిని ముందుగా కలిపి నిల్వ చేయచ్చా? చపాతీ పిండిని ప్రతిరోజూ కలపడానికి బద్దకించిన వారు ఒక రోజే మూడు రోజులకు సరిపడా చపాతీ పిండిని కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇలా ముందు రోజే చపాతీ, పూరీ పిండిని చేసుకుని తినడం వల్ల ఇలాంటి ఉపయోగం ఉండదు. పైగా అది హానికరం కూడా. చపాతీ పిండిని కలిపాక రెండు గంటల్లోపే దాన్ని వాడేయాలి. మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో దాయడం వంటివి చేయకూడదు. ఫ్రిజ్‌లో చపాతీ పిండిని కలిపి నిల్వ చేస్తే దానిలో రసాయనిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ పిండిలో బ్యాక్టీరియా, ఫంగస్ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇలా నిల్వ చేసిన పిండితో చపాతీ, పూరీలు చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలకి ఇవి చాలా ప్రాణాంతకంగా మారుతాయి. కాబట్టి చపాతీలు, పూరీలు వీలైనంత వరకు ఎప్పటికప్పుడు పిండి కలుపుకొని వండుకోవడమే మంచిది. గోధుమ పిండిలో ఉన్న జింక్, ఐరన్, క్యాల్షియం వంటివి కూడా నిల్వ చేసే క్రమంలో కనుమరుగైపోతాయి. ఇలాంటి పిండిని అధికంగా తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది.