పెరుగుతో ఇలా చేస్తే జుట్టుకి రక్ష పెరుగులో ఉండే పోషకాలు వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా పనిచేస్తాయి. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. నెలలో కనీసం రెండు మూడు సార్లు ఈ పెరుగు ప్యాక్‌లను జుట్టుకు ప్రయత్నించండి. జుట్టు బాగా పెరుగుతుంది. పెరుగులో అర చెక్క నిమ్మరసం కలిపి నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి వేయాలి. ఈ పేస్టును తలకి పట్టిస్తే చుండ్రు పోతుంది. వెంట్రుకలు పట్టులా మెరవాలంటే అరకప్పు పెరుగులో ఒక టీ స్పూన్ తేనె వేసి ఒక స్పూన్ బాదం నూనె వేసి తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి. పెరుగులో మందార ఆకుల పేస్టును వేసి వారానికి కనీసం రెండు మూడు సార్లు అప్లై చేసినా కూడా జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మెంతులు, పెరుగు కలిపి మెత్తని పేస్టులా కలిపి జుట్టుకు రాసుకుంటే పట్టులా మెరుస్తాయి వెంట్రుకలు. మందార ఆకులను, పెరుగును కలిపి మెత్తని పేస్టులా చేసి తలకు రాసుకుంటే జుట్టు రాలిపోకుండా ఉంటుంది. జుట్టు కోసం పెరుగును వారానికోసారైనా తలకు పట్టించడం అలవాటు చేసుకోండి.