ఆత్మహత్యలు అధికంగా ఆ దేశంలోనే ఆత్మహత్య ఆలోచనలు రావడం అనేది వారి మానసిక పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అది కూడా ఒక రుగ్మతే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆత్మహత్య అనేది ప్రజారోగ్య సమస్యగానే చూడాలని చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కువగా అమెరికాలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాదాపు 40 శాతం మంది అమెరికా వాస్తవ్యులే. గత ఏడాది సంపన్న దేశమైన అమెరికాలో ఒక్క ఏడాదిలోనే 50 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి 11 నిమిషాలకు అక్కడ ఒక ఆత్మహత్య నమోదు అవుతుంది. మానసిక ఆరోగ్యం బాగోనప్పుడే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. ఆత్మహత్యల ఆలోచనలకు కేవలం వారి మానసిక ఆరోగ్యమే కాదు గాలిలో నాణ్యత తగ్గినా కూడా ఆ ఆలోచనలు వస్తాయని ఒక అధ్యయనం చెబుతోంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రదేశాల్లో జీవించే వారికి అలాంటి సూసైడ్ ఆలోచనలు త్వరగా వచ్చే అవకాశం ఉందని ఈ పరిశోధనా వివరిస్తోంది.