పొడిగా, శుభ్రంగా ఉన్న జుట్టుకు కాఫీ పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు మెరుస్తూ అందంగా ఉంటుంది.

కాఫీ పొడిని స్క్రబ్ గా వాడితే చర్మం మీద మృతకణాలు తొలగి పోయి చదర్మం కొత్త మెరుపులు సంతరించుకుంటుంది.

తాజా కాఫీపొడి ఏదైనా ఓపెన్ కంటైనర్ లో వేసి కార్లో పెట్టుకుంటే దుర్వాసన రాకుండా ఉంటుంది.

కాఫీ గింజలను కాల్చినపుడు వచ్చే పొగ వల్ల దోమలు ఇతర కీటకాలకు చనిపోతాయి.

పాత బట్టలకు కొత్త లుక్ ఇవ్వాలనుకుంటే కాఫీతో డైచేస్తే సరి.

2,3 స్పూన్ల కాఫీ పొడికి కొద్దిగా నీళ్లు కలిపి దాన్ని మందంగా ఉండే పేస్ట్ లా చేసి ఫర్నిచర్ లో పగుళ్లు అతికించవచ్చు.

ఫ్రిజ్ లో కాఫీ కొంచెం కాఫీ పొడిని ఓపెన్ గా పెడితే చెడు వాసన రాకుండా ఉంటుంది.

కళ్లకింద నల్లని వలయాలను తొలగించందుకు కాఫీ బాగా ఉపయోగపడుతుంది.

చీమలకు కాఫీ వాసన నచ్చదు కనుక చీమలను తరిమేందుకు కాఫీ వాడొచ్చు.

తలస్నానానికి ముందు కాఫీ తలకు పట్టిస్తే జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది.

Representational image:Pexels