ఐస్ ముక్కలను ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా మెరుగు పరచుకునే కొన్ని చిట్కాలు

కళ్ల కింద ఉబ్బినట్లయితే ఐస్ మంచి పరిష్కారం.

ఇలాంటి సమస్య ఉన్నపుడు కళ్ల కింద ఐస్ ముక్కలతో కాపడం పెట్టుకుంటే సమస్య తగ్గిపోతుంది.

గోళ్లకు వేసుకున్న రంగు త్వరగా ఆరిపోవాలంటే ఐస్ నీళ్లు ఒక గిన్నేలో వేసి దాంట్లో చేతులు పెట్టుకుంటే సరి

స్కిన్ కాంప్లెక్షన్ మెరుగవడం కోసం ఐస్ తో ఫేషియల్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మేకప్ వేసుకునే ముందు ముఖ చర్మం మీద ఐస్ తో కాపడం పెట్టుకుంటే మంచి బేస్ గా పనిచేస్తుంది.

అలసటగా ఉన్నపుడు ఐస్ క్యూబ్స్ ఒక వెడల్పయిన గిన్నెలో వేసి అందులో ముఖాన్ని ముంచితే రిలాక్సవుతుంది.

ముఖం శుభ్రం చేసిన తర్వాత ఈ చిట్కా చెయ్యడం బావుంటుంది.



దీని వల్ల ముఖంలోకి రక్తప్రసరణ మెరుగై చర్మం బిగుతుగా కూడా మారుతుంది.

టైమ్ ఎక్కువ లేనపుడు కూడా ఐస్ క్యూబ్ ముఖం మీద రాసుకున్నా చాలు అని నిపుణులు చెబుతున్నారు.

ఐస్ వల్ల వాపు తగ్గుతుంది. చర్మరంధ్రాలు మూసుకుంటాయి. చర్మం నునుపుగా మారుతుంది.

Representational image:Pexels