పొట్టు ఉన్న పెసరపప్పు తింటే ఎంతో మేలు



పొట్టు ఉన్న పెసరపప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.



ప్రోటీన్‌కు పెసరపప్పు మంచి మూలం. మొక్కల ఆధారిత వనరులలో పెసరపప్పులోనే ప్రోటీన్ అధికంగా దొరుకుతుంది.



పొట్టు తీయని పెసరపప్పును తీసుకుని రాత్రంతా నానబెడితే ఉదయానికి మొలకలు రావడం జరుగుతుంది. ఆ మొలకలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం.



పెసరపప్పును తినడం వల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. మన శరీరానికి రోజువారి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. అలాగే ఐరన్ వంటివి కూడా అందుతాయి.



కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.



పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలు తరచూ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తగ్గుతుంది.



మహిళల ఆరోగ్యానికి కూడా పొట్టు ఉన్న పెసరపప్పు చాలా అవసరం.



గర్భిణీలు పొట్టు ఉన్న పెసరపప్పును తింటే బిడ్డలు న్యూరల్ ట్యూబ్ లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే ఆటిజం వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.