హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించారు

హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా స్వామివారు విహరించారు

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు.

బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం.

జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు

నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహవాహనం సేవ

అక్టోబర్ 17న రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ‌

వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.