తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 8న 54 వేల 609 మంది దర్శించుకున్నారు. స్వామికి 26 వేల 718 మంది తలనీలాలు సమర్పించారు. 3.39 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. బయట ఎంబసీ వరకూ క్యూలైన్సులో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.