శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో‌ ఆరోపణలు



ఘాటుగా స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం



లడ్డూ పోటూ, లడ్డూ కౌంటర్ పరిశీలించిన డిప్యూటీ కంట్రోలర్ దయాకర్ రెడ్డి



ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను ప్ర‌త్యేక‌ ట్రేలోఉంచి, బ‌రువు త‌నిఖీ చేస్తారు



అక్కడ సరిగ్గా ఉంటేనే ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను కౌంట‌ర్ల‌కు త‌ర‌లిస్తారు.



వేయింగ్ మిషన్‌లో లోపం కారణంగా మైనస్ 70 అని చూపించిదని వివరణ



ఈ లోపంతోనే లడ్డూ బరువుపై భ‌క్తుల్లో అపోహలు



లడ్డూ బరువు కచ్చితంగా 160 నుంచి 180 గ్రాములు ఉంటుందని వివరణ



ల‌డ్డూపై అనుమానం ఉంటే కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేయాలి



70 గ్రాములు తక్కువ వచ్చిందంటూ భక్తుడి ఆరోపణ..



కౌంటర్ వద్ద ఉన్న వెయింగ్ మిషన్ లో తూకం వేశాడు.



ఒక్కో లడ్డు పరిమాణం 98 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వచ్చింది.
దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.