బెంజ్ కార్ గుద్దితే రెండు ముక్కలైన ట్రాక్టర్, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు చంద్రగిరి నేషనల్ హైవే లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంజ్ కారు, ఓ ఇసుక ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాకర్ట్ రెండు ముక్కలైంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తిరుపతికి వస్తున్న బెంజ్ కారును ఇసుక లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ అడ్డుగా రావడంతో ఢీకొట్టింది. ట్రాక్టర్ బోల్తా పడింది. ఆపై ఇంజన్, ట్రాలీ రెండుగా విడిపోయి ట్రాక్టర్ రెండు ముక్కలుగా మారింది.4 బెంజ్ కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ మునికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది తెలిసిన స్థానికులు చూసేందుకు భారీ సంఖ్యలో చంద్రగిరి హైవే వద్దకు వచ్చారు. కారు, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ రెండు ముక్కలై రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ రూల్స్ ఒక్క వాహనం పాటించకపోయినా ఇలాంటి ఘటనలు జరుగుతాయని పోలీసులు హెచ్చరించారు